: తనకేపాపం తెలీదంటోన్న 'కేరళ ఎక్స్ ప్రెస్'


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీశాంత్ తాను అమాయకుణ్ణని అంటున్నాడు. తాను తప్పుచేయలేదని స్పష్టం చేశాడు. క్రికెట్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించలేదని వివరణ ఇచ్చాడు. తన న్యాయవాది రెబెక్కా జాన్ తో ఈ తాజా సందేశాన్ని మీడియాకు చేరవేశాడీ కేరళ ఎక్స్ ప్రెస్ బౌలర్. ఓ క్రికెటర్ గా ఎదురుదెబ్బలను ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నానని చెబుతూ, ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కష్టకాలం నడుస్తోందని పేర్కొన్నాడు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందంటూ, త్వరలోనే సచ్ఛీలుడనై తిరిగొస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News