: క్యాడ్బరీ చాక్లెట్లో పిన్ను.. సంస్థకు జరిమానా వడ్డింపు


ఉత్పత్తుల తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సుప్రసిద్ధ చాక్లెట్ తయారీదారు క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్ సంస్థకు వినియోగదారుల ఫోరం జరిమానా వడ్డించింది. త్రిపుర రాజధాని అగర్తలలో ఓ వ్యక్తి తన మూడేళ్ళ కుమార్తె కోసం క్యాడ్బరీ చాక్లెట్ కొన్నాడు. అయితే, ఆ చాక్లెట్లో ఓ ఇనుప పిన్ను ఉండడం చూసి అవాక్కైన ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై విచారణ జరిపిన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సంఘం నెలలోపు సదరు వ్యక్తికి రూ.30 వేలు పరిహారం చెల్లించాలంటూ నేడు ఆదేశించింది. అంతేగాకుండా విచారణ ఖర్చుల నిమిత్తం వెయ్యి రూపాయలు చెల్లించాలని కూడా ఆ బహుళజాతి చాక్లెట్ తయారీదారుకు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News