: ఓక్లహామా టోర్నడో శక్తి అణుబాంబు కంటే అధికమట
అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రాన్ని కుదిపేసిన టోర్నడో ఎంత శక్తిమంతమైనదో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రచండశక్తితో కూడిన గాలి, వర్షపాతం కలగలసి ఓక్లహామాను అతలాకుతలం చేశాయి. మొత్తం 91 మందిని బలిగొన్న ఈ పెను ఉత్పాతం శక్తి, అలనాడు అమెరికా.. జపాన్ నగరం హిరోషిమాను నేలమట్టం చేసేందుకు వినియోగించిన అణుబాంబు శక్తికి కొన్ని వందల రెట్లు ఎక్కువని వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. టోర్నడో వెలువరించిన గాలి గంటకు 320 కిలోమీటర్ల వేగంతో వీచిందని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. కాగా, టోర్నడోలు ఇంత సమయంపాటు విలయం సృష్టించడం చాలా అరుదని వాతావరణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. తాజా టోర్నడో దాదాపు గంటపాటు తన విశ్వరూపం ప్రదర్శించింది.