: ఆర్థిక ఉగ్రవాదిని దేశం నుంచి తరిమి కొట్టాలి: ఆనం
జగన్మోహనరెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పదునైన విమర్శల దాడి కొనసాగుతోంది. జగన్ ను ఉరితీయాలన్న ఆనం తాజాగా జగన్ ను ఆర్ధిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఒక వ్యక్తి తన దుర్మార్గపు, క్రిమినల్ ఆలోచనలతో వ్యవస్థపై దాడిచేస్తే అది ఉగ్రవాదం కాదా? అని ప్రశ్నించారు. ఆర్థిక ఉగ్రవాదిని(జగన్ ను ఉద్దేశించి) దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకుని, నేలమాళిగల్లో దాచుకుని ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఆర్థిక ఉగ్రవాదం నుంచి ప్రజలను, సమాజాన్ని, ఆస్తులను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.