: ఫిక్సింగ్ పై వివరణ ఇవ్వండి: బీసీసీఐ, క్రీడల శాఖకు హైకోర్టు నోటీసులు
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై పీటర్ రమేశ్ అనే న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఫిక్సింగ్ కుంభకోణంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐతోపాటు క్రీడల మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. రమేశ్ తన పిటిషన్ లో ఫిక్సింగ్ కేసును సీబీఐకి బదలాయించాలని కోరారు. ప్రైవేటు సంస్థ అయిన బీసీసీఐ తన క్రికెట్ జట్టుకు ఇండియా అన్న పేరును ఉపయోగించరాదని కూడా పేర్కొన్నారు. కాగా, ఐపీఎల్ ను నిషేధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ తిరస్కరణకు గురైంది.