: ఎంపీ సీటిస్తే నేనూ డబ్బు ఖర్చుపెడతా: గద్దే రామమోహన్ రావు


విజయవాడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కేశినేని నాని రంగ ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నాని రంగప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు కూడా చేరిపోయారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానమనీ, అయితే డబ్బే రాజకీయం కాదని టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు అన్నారు. టీడీపీ తరపున ఎంపీ సీటిస్తే తాను కూడా డబ్బు ఖర్చుపెడతానని అన్నారు. ఎంపీ సీటు తన డిమాండ్ అయినా పార్టీ అధినేత ఎలా చెబితే అలా నడుచుకుంటానంటున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు డబ్బు ఖర్చుపెడితే, ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ డబ్బు ఖర్చుపెడుతున్నవారి సంగతేంటని ప్రశ్నించారు. త్వరలోనే బాబును కలిసి ఎంపీ సీటు సంగతి తేలుస్తానన్నారు.

  • Loading...

More Telugu News