: స్పాట్ ఫిక్సింగ్ పై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిల్
ఐపీఎల్ లో బయటపడిన స్పాట్ ఫిక్సింగ్ పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో ఈ రోజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై జూన్ 10లోపు వివరణ కోరుతూ క్రీడామంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, ఐపీఎల్ చైర్మన్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.