: బంగారం దిగుమతి విలువ తగ్గింపు
అంతర్జాతీయంగా బంగారం ధరలు క్రమంగా పతనమవుతున్న నేపథ్యంలో ఆ మేరకు మరోసారి దిగుమతి ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 10 గ్రాముల దిగుమతి విలువను 440 డాలర్లకు అంటే 24,200 రూపాయలకు తగ్గించింది. ఈ విలువపైనే దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుంది. దిగుమతి విలువను తక్కువగా చూపించి పన్ను ఎగ్గొట్టే అవకాశం లేకుండా ప్రభుత్వం బంగారం దిగుమతి టారిఫ్ ను అమలు చేస్తోంది.