: నగరంలో మూతపడిన పార్కులు: లవర్స్ డే ఎఫెక్ట్
వాలెంటైన్స్ డే ప్రభావం నగరంలో హెచ్చు స్థాయిలోనే కనిపిస్తోంది. హైదరాబాద్ లోని పార్కులన్నింటిని ఈరోజు మూసివేశారు. ఎవరైనా అమ్మాయి, అబ్బాయి జంటగా కనిపిస్తే పెళ్లి చేయడం తథ్యమని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ వంటి హిందుత్వ సంస్థలు హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు. సాయంత్రం వరకు పార్కుల్లో ప్రవేశం కల్పించరాదని నిర్ణయంచారు.