: 1000-500 రూపాయల నోట్లు రద్దు చేయాలి: చంద్రబాబు డిమాండ్
అవినీతిపై టీడీపీ చివరి వరకూ పోరాడుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. నల్లధనం అరికడితేనే దేశాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. టీడీపీ భవన్ లో మాట్లాడిన ఆయన నగదు వ్యవహారాలు బ్యాంకుల ద్వారా జరిగితేనే నల్లధనం అరికట్టవచ్చన్నారు. 1000,500 రూపాయల నోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసారు. కరెన్సీలో 33 శాతం వెయ్యినోట్లే ఉన్నాయన్న బాబు, దేశంలో 70 లక్షల కోట్ల నల్లధనం ఉందని అంచనాలున్నాయని తెలిపారు. అవినీతి రహిత భారతదేశం ఏర్పడే వరకూ పోరాడుతామని తెలిపారు. నల్లధనం చివరకు క్రీడల్ని కూడా శాసిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నకిలీ బదిలీగా మార్చేసిందని విమర్శించారు.