: పతనమవుతున్న రూపాయి విలువ
డాలర్ తో రూపాయి మారకం విలువ క్రమంగా పడిపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 53 రూపాయలుగా ఉంటే అది ఈ రోజు 55.40కి క్షీణించింది. గతేడాది పడిపోయిన కనిష్ఠ స్థాయిలకు మళ్లీ రూపాయి విలువ చేరువవుతోంది. గతేడాది డాలర్ తో రూపాయి మారకం విలువ 57 రూపాయల వరకూ పడిపోయి మళ్ళీ 52 రూపాయల వరకూ కోలుకున్న సంగతి తెలిసిందే. తిరిగి మళ్లీ క్రమంగా క్షీణిస్తోంది. చూడబోతుంటే రానున్న రోజుల్లో రూపాయి విలువ సరికొత్త కనిష్ఠ స్థాయిని నమోదు చేసేలా ఉంది.