: వలసవాద సంస్కరణ బిల్లు మరో అడుగు ముందుకు
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1.10కోట్ల మంది విదేశీయులకు చట్టబద్ధమైన పౌరసత్వం కల్పించే వలసవాద సంస్కరణల బిల్లుకు అమెరికా సెనేట్ ప్యానెల్ ఆమోదం తెలిపింది. ఇందులో కొన్ని సవరణలు జరిగాయి. ఇక ఈ బిల్లుకు సెనేటర్లు ఆమోదం తెలపాల్సి ఉంది. వారు కూడా ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపంలోకి వస్తుంది. ఫలితంగా అక్కడ అక్రమంగా నివసిస్తున్న 2.5లక్షల మంది భారతీయులు ఆ దేశ పౌరులుగా మారతారు.