: కాంగ్రెస్ పార్టీ వెబ్ సైట్ ప్రారంభం
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోసం రూపొందించిన వెబ్ సైట్ www.apcongress.org ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో జరుగుతున్న పీసీసీ రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రారంభించారు. అధిష్ఠానం ఆదేశాలతోనే వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ చెప్పారు. ఇందులో పార్టీ సమాచారమంతా పొందుపరిచామని తెలిపారు.