: వడగాల్పులు.. వర్షాలు


నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, కడప, చిత్తూరు జిల్లాలలో మరో రెండు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిసా, కోస్తా మీదుగా తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీనివల్ల అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీలు నమోదైంది. రెంటచింతలలో 45, ఆదిలాబాద్ లో 45, నిజామాబాద్ లో 44.6, గుంటూరులో 44.4, నల్గొండలో 44, విజయవాడలో 44, తిరుపతిలో 43, హైదరాబాద్ లో 42, విశాఖలో 38 డిగ్రీలు నమోదైంది.

  • Loading...

More Telugu News