: తలచిన వేళనే వైకీతో వీసా


మనం విదేశాలకు వెళ్లాలనుకుంటే వీసా, పాస్‌పోర్ట్‌ అవసరం. మనం ఏ దేశాలకు వెళ్లాలనుకుంటామో ఆ దేశాల కాన్సులేట్‌కు వెళ్లి వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది నగరాల్లోని నివాసం ఉండేవారు కాన్సులేట్‌కు వెళ్లాల్సి రావడం పెద్ద సమస్య కాదు. కానీ పల్లెల్లో ఉండేవారికి ఇది చాలా పెద్ద సమస్యే. ఇకనుండి ఇలా ఆయా దేశాల కాన్సులేట్‌కు వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా ఏటీఎం తరహాల్లో అత్యంత సులభంగా వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'వైకీ' మనకు ఏటీఎం తరహాలో ఎక్కడికి కావాలిస్తే అక్కడికి వీసాను ఇస్తుంది. వీసా ఔట్‌సోర్సింగ్‌ దిగ్గజం వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ సంస్థ ఇందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సంస్థ వైకీ పేరుతో ఒక స్మార్ట్‌ అప్లికేషన్‌ సబ్‌మిషన్‌ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ సిస్టమ్‌ పనితీరుపై ముంబైలో టెస్ట్‌రన్‌కూడా నిర్వహిస్తోంది. ఈ మిషన్‌ గురించి సంస్థ సీఈవో జుబిన్‌ కర్కారియా మాట్లాడుతూ 'వైకీ అనేది ఒక ఏటీఎంలాగా పనిచేస్తుందని, మీ వీసా లేదా పాస్‌పోర్ట్‌కు సంబంధించిన దరఖాస్తును, ఫీజును, వేలిముద్రలను దీనిద్వారా సబ్‌మిట్‌ చేసిన కొద్ది రోజులకు మీకు రావల్సిన పేపర్లు మీ చిరునామాకు వచ్చి చేరుతాయని, దీనివల్ల వీసా లేదా పాస్‌పోర్ట్‌ కోసం కాన్సులేట్‌లకు, ఎంబసీలకు వెళ్లాల్సిన పనిలేదని' అన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతోబాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలతో కూడా దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని, ముంబైలో దీన్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నామని ఆయన తెలిఆపారు. అన్ని పరీక్షలూ పూర్తయి అనుమతులు లభిస్తే త్వరలో వైకీ అందరికీ అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News