: నీటిలోనూ పనిచేసే అతిచిన్న టాబ్లెట్‌


సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన చాలా వరకూ వస్తువులు నీరు తగిలితే ఇక వాటిపై ఆశ వదులుకోవాల్సిందే. అయితే ఈ టాబ్లెట్‌ మాత్రం ఒక మీటరు లోతు నీటిలో అరగంటసేపు ఉంచినా కూడా చక్కగా పనిచేస్తుందట. ఈ విధంగా దీన్ని రూపకల్పన చేశారు సోనీ కంపెనీవారు. ఈ టాబ్లెట్‌ ప్రపంచంలోనే అతి చిన్న టాబ్లెట్‌ కావడం దీని మరో ప్రత్యేకత.

సోనీ ఎక్స్‌పెరియా జడ్‌ పేరిట విడుదల కానున్న ఈ టాబ్లెట్‌ నీటితోబాటు, దుమ్ము, ధూళిని కూడా నిరోధించే ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌ అని సోనీ కంపెనీ వారు చెబుతున్నారు. ఇందులో క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తోబాటు 2 జీబీ ర్యామ్‌, ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటర్నల్‌ డాటా స్టోరేజ్‌ కోసం మైక్రోఎస్‌డి స్లాట్‌తో హైస్పీడ్‌ మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయ్యేందుకు కూడా ఈ టాబ్లెట్‌ ఉపకరిస్తుందని కంపెనీ వారు చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ టాబ్లెట్‌ ఈనెలలోనే విడుదల కానుంది. కావల్సినవారు వెంటనే వెళ్లి బుక్‌ చేసుకోండి...!

  • Loading...

More Telugu News