: విందూ సింగ్ కు మూడు రోజుల కస్టడీ


స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ సింగ్ కు కోర్టు మూడు రోజుల కస్టడీ విధించింది. బుకీలతో సంబంధాలున్నాయంటూ విందూ సింగ్ ను ముంబయి పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో విందూ... బుకీల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన బుకీ రమేశ్ వ్యాస్ తో ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు విందూను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News