: నేటి మ్యాచ్ కు సచిన్ దూరం
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బరిలో ఉంటే ఆ మజాయే వేరు. తమ ఆరాధ్య క్రికెటర్ పరుగులు చేయకపోయినా, మైదానంలో అతడు కనిపిస్తే చాలని భావిస్తారు. అయితే, ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సచిన్.. గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో, నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరగనున్న ప్లే ఆఫ్ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఓపెనర్ గా బరిలో దిగనున్నాడు. కాగా, ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ తొలి క్వాలిఫయర్ కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదిక. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓటమిపాలైన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విన్నర్ తో అమీతుమీ తేల్చుకుంటుంది.