: రవీంద్రుడికి పాక్ కళాశాల విద్యార్థుల నివాళి
లాహోర్ లోని ఒక ప్రముఖ కళాశాల భారతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కు నివాళులర్పించింది. ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకుని వందేళ్లయిన సందర్భంగా ఫార్మన్ క్రిస్టియన్ కళాశాలకు చెందిన చరిత్ర విభాగం, ఎవింగ్ లిటరరీ సొసైటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. నోబెల్ సాహిత్య బహుమతి విజేతల్లో ఠాగూర్ తొలివ్యక్తి అని, తొలి ఐరోపాయేతర దేశవాసి కూడా ఆయనే అని వారు ఈ సందర్భంగా కొనియాడారు. పలువురు విద్యార్థులు ఠాగూర్ కవితలు చదివి, సోనార్ బంగ్లా పాటతో తమ సమావేశాన్ని ముగించారు.