: ఐటీ పరిమితి రూ. 3 లక్షలకు పెంచాలంటున్న వేతన జీవులు
ఆదాయ పన్ను పరిమితిని కనీసం రూ. 3 లక్షలకు పెంచాలని, అలాగే విద్య, వైద్య సౌకర్యాలకు వచ్చే బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని వేతన జీవుల్లో అత్యధికులు ఆశిస్తున్నారట. డిల్లీ, కోలకతా, బెంగళూరు వంటి మహానగరాల్లో ఓ సర్వే లో వెల్లడైన అంశమిది. ఆర్ధిక మంత్రి చిదంబరం తగిన చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారని ఆ సర్వే వెల్లడిస్తోంది. ప్రస్తుతం ఐటీ పరిమితి రూ. 2 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. మహిళలకు రూ.2.5 లక్షలుగా ఉంది.