: వినోద్ రాయ్ పదవీవిరమణ కొత్త కాగ్ శశికాంత్ శర్మ
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా రక్షణశాఖ కార్యదర్శి శశికాంత్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత కాగ్ వినోద్ రాయ్ స్థానంలో శశికాంత్ గురువారం బాధ్యతలు చేపడతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్టికల్ 148(1) ప్రకారం శశికాంత్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాగ్ గా నియమించినట్టు వెల్లడించింది. శశికాంత్ 1976 బీహార్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. వినోద్ రాయ్ హయాంలో 2జీ స్కాం, బొగ్గు స్కాం వెలువడడంతో యూపీఏ అతనిపై ఎదురుదాడికి దిగింది. కాగా వినోద్ రాయ్ 22న పదవీ విరమణ చేయనున్నారు.