: శ్రీశాంతా మజాకా... ఒక్క రోజే రెండు లక్షల షాపింగ్


స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు బుకీలు, సినీ ప్రముఖుల్ని ప్రశ్నిస్తున్న పోలీసులకు శ్రీశాంత్ కళ్లు బైర్లుకమ్మే నిజాలు చెబుతున్నాడు. అతను చెప్పక ముందే అబ్బాయి రాసలీలల్ని కనుగొన్న పోలీసులకు ఐపీఎల్ 15 వ తేదీ మ్యాచ్ కు ముందు ఒకే రోజు 1.95 లక్షల రూపాయిలతో బట్టలు కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అదీకాక ఈ మెత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాడని పేర్కొనడం విశేషం. న్యాయస్థానంలో హాజరుపర్చిన పోలీసులు సెక్షన్ 409 కింద అభియోగాలు నమోదు చేసారు. శ్రీశాంత్, చండీలా, చవాన్ తోపాటూ మరో ఎనిమిది మంది కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని కోరారు.

  • Loading...

More Telugu News