: 128 ఏళ్లనాటి చట్టానికి సవరణ
128 ఏళ్లనాటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టును సవరించడానికి పూనుకుంది భారత ప్రభుత్వం. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(ఇంటర్నెట్ టెలిఫోనీ)ని దుర్వినియోగం చేయకుండా ఈ చర్య చేపట్టబోతున్నారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో హోం మంత్రిత్వశాఖ, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల అధికారులను ఈ మేరకు ఒక ప్రతిపాదన రూపొందించాల్సిందిగా కేంద్ర హోం సెక్రటరీ ఆర్ కే సింగ్ సూచించారు. దేశంలోని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సేవలందించే సర్వీస్ ప్రొవైడర్లన్నీ తప్పనిసరిగా రిజిష్టర్ చేసుకునేలా ఈ సవరణ ఉండాలని సూచించారు. మరిన్ని కీలక అంశాలను కూడా సమావేశంలో చర్చించారు.