: మాజీ ఎంపీ కెవీఆర్ చౌదరి కన్నుమూత
రాజమండ్రి నియోజక వర్గ మాజీ పార్లమెంటు సభ్యుడు కేవీఆర్ చౌదరి కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. 1991లో తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నికల్లో విజయం సాధించిన చౌదరి, 1996 వరకు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా సేవలందించారు. కాగా, ఆయన అంత్యక్రియలు గురువారం మండపేటలో జరగనున్నాయి.