: శత వసంతాల సినిమా సంబరాలకు ముమ్మర ఏర్పాట్లు
భారతీయ సినిమా శత వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నూరేళ్ల సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు చిత్రపరిశ్రమ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని 19 భాషలకు చెందిన కళాకారులంతా చెన్నైలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారని, అంతకు ముందే హైదరాబాద్ లో సన్నాహక సంబరాలను నిర్వహిస్తున్నట్టు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. భారతీయ సినిమా చారిత్రక ఆధారాలతో కూడిన ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపిన భరద్వాజ, ఇందుకు అభిమానులు, ప్రేక్షకులు, ప్రజలు సహకరించాలని కోరారు. బుధవారం నుంచి ఆరు రోజులపాటు ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో రామానాయుడు కళ్యాణమండపంలో సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.