: ఓవర్ నైట్ స్టార్ అయ్యేందుకు శ్రీశాంత్ 'మల్టీ' ప్లాన్


భారత క్రికెట్ 'బ్యాడ్ బాయ్' శ్రీశాంత్ నేల విడిచి సాము చేసే తత్వం కలవాడంటున్నారు ఢిల్లీ పోలీసులు. క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీశాంత్ ను అరెస్టు చేసి, అతని ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ల్యాప్ టాప్ లో వివరాలను విశ్లేషించిన పోలీసులకు శ్రీశాంత్ సినిమా పిచ్చి అవగతమైంది.

స్వల్ప కాలంలోనే ఎదగాలన్నది ఈ కేరళ ఎక్స్ ప్రెస్ ఆకాంక్ష అని, అందుకు సినిమా నిర్మాణమే ఏకైక మార్గమని అతడు నమ్మినట్టు తెలుస్తోంది. పలువురు బాలీవుడ్, మలయాళ సినీ ప్రముఖులతో శ్రీ నెరుపుతున్న సంబంధాలు ఈ విషయాన్ని నిజమే అని చెబుతున్నాయి. పైగా తనను నటుడిగానూ వెండితెరపై చూసుకోవాలనుకున్న ఈ మిస్టర్ బ్యాచిలర్.. ఓ మల్టీ స్టారర్ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేశాడట. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. అందులో తాను నటించవచ్చూ.. పైగా, ఆ సినిమాతో లాభాలు ఆర్జించవచ్చన్నది శ్రీశాంత్ యోచన అని తెలుస్తోంది. పాపం, కథ అడ్డం తిరిగింది, శ్రీ పోలీస్ కస్టడీకి చేరాడు.

  • Loading...

More Telugu News