: రేపు ఇమ్రాన్ ఖాన్ డిశ్చార్జ్


పాకిస్థాన్ ప్రముఖ మాజీ క్రికెటర్, తెహ్రికె ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఎన్నికల ప్రచారంలో గాయపడ్డ ఇమ్రాన్ 'షౌకత్ ఖనూమ్' ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వెన్నుగాయం నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఆయన వెన్ను పూసకు ప్రత్యేక పరికరాన్ని అమర్చారని, ఎవరి సాయం లేకుండా ఆయన 300 మీటర్లు నడిచారని డాక్టర్లు తెలిపారు. రేపు డిశ్చార్జ్ చేశాక ఫిజియోథెరపీ చేస్తే సరిపోతుందని తెలిపారు. పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మూడవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News