: కాంగ్రెస్ ధాటికి బెంబేలెత్తిపోతున్నారు: లోకేష్
టీడీపీ అధికారంలోకి రాకుంటే యువత, పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని నారా లోకేష్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన మినీ మహానాడు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ అవినీతికి భయపడి రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలే పారిపోతున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.