: ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగుల ప్రమాణం
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సచివాలయ ఉద్యోగులందరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రతిజ్ఞ చేయించారు. సంప్రదాయమైన అహింస, సహనం పట్ల నిబద్దతతో ఉంటామని, ఉగ్రవాద హింసను సర్వశక్తులు ఒడ్డి అన్నివిధాలుగా ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగులు ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు.