: గుంటూరులో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
కంప్యూటర్, ప్రింటర్ల సాయంతో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను గూంటురు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50వేల విలువైన నకిలీ నోట్లను, కంప్యూటర్, ప్రింటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.