: చేరువవుతున్న రుతుపవనాలు


మూడు రోజుల క్రితమే అండమాన్ తీరానికి చేరుకున్న నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత మరింత ముందుకు కదిలి బంగాళా ఖాతంలో విస్తరించాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే కేరళ తీరానికి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి జూన్ 3 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. అలా అయితే మన రాష్ట్రంలోకి జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే ప్రస్తుత సానుకూల వాతావరణం ఇలానే కొనసాగితే రుతుపవనాలు ఈ నెల 28 నాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. అలా అయితే మన రాష్ట్రంలోకి రుతుపవనాలు మరింత ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News