: కేన్స్ లో మెరిసిన ఐష్


అందాలతార ఐశ్వర్యారాయ్ కేన్స్ లో తళుక్కుమన్నారు. రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఫోటోగ్రాఫర్లకు చేతినిండా పని కల్పించారు. నలుపు రంగు ఎలీసాబ్ గౌనులో ఐష్ కనబడగానే ఫ్లాష్ లు పండగ చేసుకున్నాయి. 'ఇన్ సైడ్ లెవిన్ డెవిస్' చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు ఈ సుందరాంగి హాజరయ్యారు. తరువాత జరిగిన వందేళ్ళ భారతీయ సినిమా వేడుకకు సంప్రదాయ బంగారు జరీ అంచు చీరలో వచ్చి అందర్నీ అలరించారు. గత 12 ఏళ్ళుగా కేన్స్ కు వస్తున్న ఐశ్వర్యకు ఈ ఏడాది గౌరవ విశిష్ట అతిథి హోదాలో ఆహ్వానం అందింది.

  • Loading...

More Telugu News