: కేన్స్ లో చిరు సందడి
కేన్స్ చిత్రోత్సవంలో చిరు ఫ్యామిలీతో పాటు సందడి చేసారు. ఆయన భార్య సురేఖ, కోడలు ఉపాసన, యువహీరో రాంచరణ్ తేజ్ కూడా చిత్రోత్సవానికి హాజరయ్యారు. నటుడిగా ఆ ఘనత దక్కించుకోలేకపోయిన చిరు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో హాజరయ్యారు. ఈ వేడుకలో చిరంజీవి భారతదేశం చిత్ర నిర్మాణానికి ఎంత అనువైన దేశమో వివరించారు.
ప్రధానోపన్యాసం చేసిన చిరంజీవి అంతర్జాతీయ సినీనిర్మాణానికి ఇండియాను మించిన ప్రదేశం లేదన్నారు. ఖర్చుకూడా తక్కువేనని సూచించారు. భారత్ లో ఏకకాలంలో వివిధ వాతావరణ పరిస్థితులుండడంతో వివిధ కాలాలను, ప్రాంతాలను ఒకేసారి చూడొచ్చని తెలిపారు. 365 రోజులూ ఇక్కడ చిత్రనిర్మాణం చేసుకోవచ్చన్నారు. షూటింగ్ లకు సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయబోతున్నట్టు తెలిపారు. భవిష్యత్ లో కేన్స్ లాంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో భారతీయ చిత్రాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటాయన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఈగ సినిమా ప్రదర్శితమౌతుండడంతో రాజమౌళి కుమారుడు కార్తికేయ కేన్స్ చిత్రోత్సవానికి వెళ్ళారు.