: ఫిక్సింగ్ రోగానికి ప్రీతిజింటా సూచిస్తున్న చికిత్స
స్పాట్ ఫిక్సింగ్ లాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పంజాబ్ కింగ్స్ 11 జట్టు యజమానులు ప్రీతిజింటా, నెస్ వాడియా కొన్ని సూచనలతో ముందుకు వచ్చారు. ఫ్రాంచైజీ యజమానులకు ఐపిఎల్ పాలనామండలిలో చోటు కల్పించాలని ప్రతిపాదన చేశారు. అలాగే, బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలని, క్రికెటర్లకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బెట్టింగ్ ను చట్టబద్ధం చేయడం వల్ల ఎటువంటి సమస్య ఉండబోదన్నారు.