: కళంకిత మంత్రులను తొలగించాలి: బీజేపీ
ఆరుగురు కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోయి కోటేశ్వరరావు డిమాండ్ చేసారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడిన ఆయన సీబీఐ విచారణ జరుగుతున్నది వైఎస్ ప్రభుత్వంలోని మంత్రులపైనే అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మంత్రులను తొలగించకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పతనమవ్వడం ఖాయమన్నారు.