: వేలానికి మహాత్ముడి రక్తపు బొట్టు
భరత భూమిని దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ప్రసాదించిన మహనీయుడు గాంధీజీ. నేడు ప్రపంచంలో ఒబామా, మండేలా తదితర గొప్పనేతలందరికీ బాపూజీయే మార్గదర్శకుడు. అలాంటి గొప్ప వ్యక్తి స్మృతులను ప్రపంచంలో ఎవరైనా గౌరవించాలి, పదిలపరచాలి. కానీ, అంగట్లో సరుకుల్లా మహాత్ముడి వస్తువులతో కాసులు పిండుకుంటున్నాయి విదేశీ వేలం సంస్థలు.
మహాత్ముడి పాదరక్షల జత, బాపూజీయే స్వయంగా తన కోసం తయారు చేసుకున్న శాలువా, ఆయన ప్రసంగాలు, మహాత్ముడి రక్తపు బొట్టు ఉన్న స్లైడ్(గాజు పలక)ను లండన్ లో ముల్ కాక్స్ సంస్థ నేడు వేలం వేస్తోంది.