: మలాలాకు గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు


బాలికా విద్యకోసం పోరాడుతూ తాలిబన్ కాల్పుల్లో గాయపడి మృత్యుముఖంలోకి వెళ్ళి వచ్చిన పాకిస్థానీ బాలల హక్కుల కార్యకర్త మలాలా యుసఫ్ జాయ్(15) ఈ ఏడాది గ్లోబల్ లీడర్ షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బాలికా విద్య సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా మలాలాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు యూఎన్ఏ తెలిపింది. ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 6న నిర్వహించే కార్యక్రమంలో మలాలా ఈమేరకు అవార్డును స్వీకరించనున్నారు. కాగా నవంబర్ 10 ని 'మలాలా డే'గా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ గత ఏడాది ప్రకటించారు. మలాలాను ఆయన ఐక్యరాజ్యసమితి కూతురుగా అభివర్ణించడం విశేషం.

  • Loading...

More Telugu News