: ఐపిఎల్ ఉద్దండ జట్ల మధ్య పోరు నేడే
ఐపిఎల్ పోరు తారస్థాయికి చేరుకుంది. 6వ ఎడిషన్ లో నేడు తొలి ప్లేఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. 11 విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఢిల్లీలో రాత్రి 8 గంటల నుంచీ హోరాహోరీ పోరు జరగనుంది. ఇందులో విజేత జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఈ రోజు ఓడిన జట్టు రేపు హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ విజేతతో మరోసారి ఫైనల్ కు వెళ్లే అదృష్టాన్ని24న పరీక్షించుకుంటుంది. ఫైనల్ పోరు 26న కోల్ కతాలో జరుగుతుంది.