: షుగర్‌ వ్యాధిని నయం చేయవచ్చు


షుగర్‌ వ్యాధి వస్తే దాన్ని నయం చేయడం అనేది ఉండదు. అదుపులో మాత్రమే ఉంచుకోవచ్చు. అయితే తాము కనుగొన్న ఒక ప్రోటీన్‌తో షుగర్‌ వ్యాధిని నయం చేయవచ్చని చెబుతున్నారు ఆష్ట్రేలియన్‌ శాస్త్రవేత్తలు. ఈ ప్రోటీన్‌ మధుమేహాన్ని అరికట్టడమే కాదు... తొలి దశలో ఉన్న టైప్‌`1 డయాబెటిస్‌ ను కూడా నయం చేస్తుందని చెబుతున్నారు.

ఆష్ట్రేలియాకు చెందిన వాల్టర్‌ అండ్‌ ఎలిజీ హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని మాలిక్యులర్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన నిపుణులు డాక్టర్‌ ఎస్తర్‌ బండాలా శాంషెజ్‌, డాక్టర్‌ యుగ్జియా ఝాంగ్ లు సీడీ 52 అనే ప్రోటీన్‌ను గుర్తించారు. ఈ ప్రోటీన్‌ మధుమేహాన్ని నయం చేస్తుందని, దీనితోబాటు మల్టిపుల్‌ స్కెరాసిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులను అరికట్టడంలో కూడా ఈ ప్రోటీన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇది నిజంగా మధుమేహ రోగులకు ఒక శుభవార్తే...!

  • Loading...

More Telugu News