: రాష్ట్రం తల లేని మొండెంలా ఉంది: బీవీ రాఘవులు
పదవులే ముఖ్యమంటూ మంత్రులు అధిష్టానం చుట్టూ ప్రదక్షణలు చేస్తుండడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపించడం లేదని సీపీఎమ్ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. ఇక ప్రభుత్వం లేని రాష్ట్రం తల లేని మొండెంలా ఉందంటూ చమత్కరించారు.
వారికి పదవులే ముఖ్యమయ్యాయని, ప్రజా సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. సహకార సంఘాల ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషించిందన్న రాఘవులు, తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు.