: వీడియో గేమ్స్‌తో గుండెకు మేలే...!


చిన్న పిల్లలు వీడియో గేములంటే చాలా ఇష్టపడతారు. కానీ వీడియో గేములను ఆడడం వల్ల తక్కువ సమయం చదువుకుంటున్నారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే వీడియో గేములు ఆడడం వల్ల మీ పిల్లల గుండె ఆరోగ్యంగా ఉంటుందట... ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. గతంలో ఎక్కువ సమయం వీడియో గేములను ఆడడం వల్ల వారి గుండె కొట్టుకునే స్థాయి విపరీతంగా పెరుగుతుందని వంటి విషయాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మాత్రం వీడియో గేములను ఆడడం వల్ల వారి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను గురించి అధ్యయనం చేశారు. అధిక తీవ్రత కలిగిన వీడియో గేములను ఆడడం వల్ల చిన్నారుల రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తోందని, దీని వల్ల వారి గుండె ఆరోగ్యం మెరుగవుతోన్నట్టు గుర్తించారు.

పశ్చిమ ఆష్ట్రేలియా విశ్వవిద్యాలయం, స్వాన్‌సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా 9 నుండి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలను పరిశీలించారు. ఇందులో అధిక తీవ్రత కలిగిన, తక్కువ తీవ్రత కలిగిన వీడియో గేములను ఆడేసమయంలో వారి ఆరోగ్యాన్ని గురించి విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఎక్కువ తీవ్రత కలిగిన వీడియో గేములను ఆడే పిల్లల్లో వారి గుండె ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతున్నట్టు గుర్తించారు. డాక్టర్‌ లూయీస్‌ నేలర్‌, మైఖేల్‌ రోసెన్‌బర్గ్‌లు పిల్లల్లో శక్తి వ్యయం, తక్కువ తీవ్రత కలిగిన వీడియో గేములను ఆడేటప్పుడు కన్నా ఎక్కువ తీవ్రత కలిగిన వీడియో గేములను ఆడే సమయంలో ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకునే రేటు కూడా ఎక్కువగా ఉందని దీనివల్ల వారి గుండె ఆరోగ్యం మెరుగవుతున్నట్టు గుర్తించారు. ఇది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికి మరింత ప్రయోజనాన్ని చేకూర్చుతుందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News