: మ్యూజిక్ డైరక్టర్లపై కళాకారుల కన్నెర్ర
టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అన్ని మ్యూజిక్ రికార్డింగులను హైదరాబాద్ లోనే నిర్వహించాలని సినీ మ్యూజిక్ అసోసియేషన్ యూనియన్ డిమాండ్ చేసింది. కొందరు సంగీత దర్శకులు చెన్నైలో రికార్డింగ్స్ నిర్వహిస్తుండడంతో స్థానిక కళాకారులకు ఉపాధి కొరవడుతోందని యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ లోనే రికార్డింగులు జరపాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.