: అల్లంతో ఆస్తమాకు చెల్లుచీటీ!
మాంచి మసాలా కూరలంటే వాటిలో తప్పక అల్లం ఉండాల్సిందే. మసాలాలు వంటికి నష్టదాయకం అని చెబుతారు గానీ, అల్లం మాత్రం ఆరోగ్యదాయకమనే అంటారు వైద్యులు. తాజాగా అల్లం యొక్క విశిష్ట గుణాలపై పరిశోధించిన శాస్త్రజ్ఞులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అల్లంతో ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని హామీ ఇస్తున్నారు న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు.
శుద్ధి చేసిన అల్లాన్ని తీసుకోవడం ద్వారా ఆయాసం దూరమవడమే కాకుండా, కుచించుకుపోయిన శ్వాస నాళాలు కూడా వదులవుతాయని, తద్వారా శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు. ఈ సీజనల్ వ్యాధిని ఎదుర్కొనే ప్రభావవంతమైన ఔషధాలను కనుగొన్నా, గత 40 ఏళ్ళుగా ఆస్తమా మరింత విస్తరిస్తూనే ఉందని పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎలిజబెత్ టౌన్సెండ్ ఆందోళన వ్యక్తం చేశారు.