: ఆ ముగ్గురు క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు.. ఒప్పందాల రద్దు


స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి ఢిల్లీ పోలీసుల చేత చిక్కిన ముగ్గురు క్రికెటర్లతో ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు రాజస్థాన్ రాయల్స్ పేర్కొంది. ఈ క్రమంలో వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. పేసర్ శ్రీశాంత్, స్పిన్నర్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లు ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఫిక్సింగ్ చేసి ప్రస్తుతం పోలీసు కస్టడీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన రాయల్స్ యాజమాన్యం ఆదివారం ఫిక్సర్ల త్రయంపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది.

  • Loading...

More Telugu News