: కాగ్ చైర్మన్ కు మనీష్ తివారీ సవాలు


కాగ్ చైర్మన్ వినోద్ రాయ్ పై కేంద్రమంత్రి మనీష్ తివారీ మండిపడ్డారు. 2 జీ కుంభకోణంలో 1.78 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నివేదికలో తెలిపిన వినోద్ రాయ్, బహిరంగ చర్చకు రావాలని తివారీ సవాలు విసిరారు. వేలం జరిపితే భారీ మొత్తంలో డబ్బు వచ్చి ఉండేదని నివేదికలో పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. మరి తాము వేలాన్ని నిర్వహించామని, నివేదికలో చెప్పినట్టు 1.78 లక్షల రూపాయల ఆదాయం రాలేదెందుకని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News