: డెడ్ లైన్ లోపే పార్టీలో చేరండి: కాంగ్రెస్ ఎంపీలతో కేసీఆర్
ఫార్మ్ హౌస్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కాంగ్రెస్ ఎంపీల భేటీ ముగిసింది. కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, రాజయ్యలు ఈ మధ్యాహ్నం కేసీఆర్ తో సమావేశమై తాము టీఆర్ఎస్ లోకి వచ్చే విషయమై చర్చించారు. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్టు తెలుస్తోంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మందా జగన్నాథం ఈనెల 30లోపు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై తేల్చకపోతే పార్టీని వీడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా భేటీలో ఎంపీలతో మాట్లాడిన కేసీఆర్.. డెడ్ లైన్ లోపే పార్టీలో చేరాలని సూచించగా.. జూన్ 3న చేరతామని ఎంపీలు చెప్పినట్టు సమాచారం.