: కోర్టులో ఆరుషి తండ్రి వింత వాదన
నోయిడాలో నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో బాలిక తండ్రి రాజేశ్ తల్వార్ కోర్టులో నేడు తన వాంగ్మూలాన్ని వినిపించాడు. ఆ హత్యలు జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నానని న్యాయమూర్తికి చెప్పాడు. అయితే, ఈ వాదనలను సీబీఐ న్యాయవాది తోసిపుచ్చారు. తల్వార్ రాత్రి 11.30 గంటలకే నిద్రకు ఉపక్రమించానని చెబుతుండగా, ఆయన నివాసంలోని ఇంటర్నెట్ రౌటర్ ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 1.30 గంటలవరకు క్రియాశీలకంగా ఉన్నట్టు రికార్డయిందని తెలిపారు. అందుకు సాక్ష్యంగా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎయిర్ టెల్ ప్రతినిధుల వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించారు.
హత్యలు జరిగిన రోజు తల్వార్ ఇంటర్నెట్ ను పలుమార్లు వినియోగించినట్టు ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, సీబీఐ వాదనలను తల్వార్ న్యాయమూర్తి ఖండించారు. ఆ ఇంటర్నెట్ రౌటర్ లో సాంకేతిక తప్పిదం చోటు చేసుకుని ఉంటుందని, అందుకే సమయాన్ని తప్పుగా నమోదు చేసి ఉంటుందని న్యాయమూర్తికి తెలిపారు.