: కేసీఆర్ తో కాంగ్రెస్ ఎంపీల ఫామ్ హౌస్ మీటింగ్
కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ అంశంపై అధిష్ఠానానికి డెడ్ లైన్ విధించిన ఎంపీలు మందా జగన్నాథం, రాజయ్య, వివేక్ లు నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో వారు సమావేశమయ్యారు. వీరి వెంట కె.కేశవరావు కూడా ఉన్నట్టు సమాచారం.