: పాఠ్యాంశంగా ప్రియాంక చోప్రా జీవితం
బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా జీవితం పాఠ్య పుస్తకాల్లో చోటు సంపాదించింది. ఇటీవల ఢిల్లీలో ఓ పాఠశాలను సందర్శించిన ప్రియాంక అక్కడ ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో తన గురించి ఏకంగా ఓ అధ్యాయం ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ప్రియాంక తండ్రి భారత సైన్యంలో ఉన్నతాధికారి కావడంతో ఆమె బాల్యం అంతా దేశంలోని పలు ప్రాంతాల్లో గడిచింది. సరిగ్గా ఈ అంశాన్నే తీసుకుని 'రోవింగ్ ఫ్యామిలీస్, షిఫ్టింగ్ హోమ్స్' పేరిట ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ పుస్తకంలో పాఠంగా మలిచారు. ఆమె చిన్ననాటి సంగతులు, మిస్ ఇండియాగా ఎంపికవడం నుంచి బాలీవుడ్ తారగా ఎదగడం వరకు ఈ అధ్యాయంలో పొందుపరిచారు. ఇందులో ప్రియాంక, ఆమె కుటుంబం ఫొటోలు కూడా ఉన్నాయట.