: ఇక టీమిండియా వెంట అవినీతి నిరోధక అధికారి


ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ రగడతో కళ్ళు తెరిచిన బీసీసీఐ.. భవిష్యత్ పై దృష్టి సారించింది. వచ్చే నెలలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా వెంట ఓ అవినీతి నిరోధక అధికారిని పంపించాలని నిర్ణయించింది. ఎనిమిది టెస్టు దేశాలు పాల్గొంటున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ను జూన్ 6 నుంచి ఇంగ్లండ్ వేదికగా నిర్వహించనున్నారు. కాగా, తాజా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం విషయమై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ రవి సవాని నేడు ఢిల్లీ పోలీసులను కలవనున్నారు.

  • Loading...

More Telugu News